కమల్ హాసన్ ‘విక్రమ్’ ట్రైలర్‌ లాంచ్ చేసిన చరణ్

Trailer launched: యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్‘. ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. “అడవి అన్నాక పులి, సింహం, చిరుత అన్నీ వేటకు వెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆలోగా సూర్యాస్తమయం ఐతే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరనేది ప్రకృతి నిర్ణయిస్తుంది కానీ.. ఈ అడవిలో వెలుగు ఎక్కడ..? ఎప్పుడు..? అని నిర్ణయించేది ప్రకృతి కాదు నేను” కమల్ హాసన్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

”నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్ తో పనిలేదు. నా గవర్నమెంట్ ని నేను తయారు చేసుకోగలను”అనే డైలాగ్ తో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది. ట్రైలర్ లో ఫహద్ ఫాసిల్ లుక్ కూడా నెక్స్ట్ లెవల్ వుంది. చిత్ర నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ నిండిన 2 నిమిషాల 38 సెకన్ల నిడివి గల విక్రమ్ ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలని పెంచేసింది.

కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ తో పాటు సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు. టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *