4.6 C
New York
Tuesday, December 5, 2023

Buy now

Homeస్పోర్ట్స్థాయ్ లాండ్ ఓపెన్: సెమీస్ లో సింధు

థాయ్ లాండ్ ఓపెన్: సెమీస్ లో సింధు

Sindhu Only: భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు మరో పతకం ఖాయం చేసుకుంది. థాయ్ లాండ్ ఓపెన్ -2022లో సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో వరల్డ్ ర్యాంకింగ్స్ లో నంబర్ 2 లో ఉన్న జపాన్ క్రీడాకారిణి అకానే యమగుచిపై 21-15; 20-22; 21-13 తో గెలుపొంది సెమీస్ లో అడుగు పెట్టింది.

తొలి సెట్ ను అవలీలగా గెల్చుకున్న సింధుకు రెండో సెట్ లో యమగుచి నుంచి గట్టి పోటీ ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ సెట్ ను సింధు కోల్పోయింది. అయితే మూడో సెట్ లో కోలుకొని ప్రత్యర్థిని దెబ్బ తీసిన సింధు జయకేతనం ఎగురవేసింది.

థాయ్ లాండ్ ఓపెన్ లో సింధు మినహా మిగలిన క్రీడాకారులంతా క్వార్టర్స్ కు చేరకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే.
రేపు జరిగే సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ ౩ ర్యాంక్ లో ఉన్న చైనా ప్లేయర్ చెన్ యూ ఫి తో సింధు తపలపడనుంది.

Also Readథాయ్ లాండ్ ఓపెన్: క్వార్టర్స్ కు సింధు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్