Saturday, January 18, 2025
HomeసినిమాIndian 2 Release: 'ఇండియన్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

Indian 2 Release: ‘ఇండియన్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

కమల్ హాసన్, శంకర్ కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమాని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ.. అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో ఇండియన్ 2 ఆగిపోయింది అనే టాక్ కూడా వచ్చింది. రావడమే కాదు.. అలా ఆగిపోవడంతోనే శంకర్ ‘గేమ్ ఛేంజర్’ మూవీని స్టార్ట్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ జరుగుతున్న టైమ్ లో కమల్ విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో  మళ్లీ ఇండియన్ 2 తెర  పైకి వచ్చింది. ఇండియన్ 2 ప్రొడ్యూసర్స్ ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత గేమ్ ఛేంజర్ పూర్తి చేయాలని కోర్టుకెక్కడంతో శంకర్ మళ్లీ ఇండియన్ 2 వర్క్ స్టార్ట్ చేయాల్సివచ్చింది.

దీంతో గేమ్ ఛేంజర్ ఎప్పుడు పూర్తవుతుందో..? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో.. క్లారిటీ లేదు. ఒకటి మాత్రం క్లారిటీ ఉంది. అది ఇండియన్ 2 రిలీజ్ తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్. మరి.. ఇండియన్ 2 రిలీజ్ ఎప్పుడంటే… సంక్రాంతి లేదా సమ్మర్ లో అని ప్రచారం జరిగింది కానీ.. తాజాగా కోలీవుడ్ లో ఇండియన్ 2 వచ్చే సంవత్సరం ఇండిపెండెన్స్ డే కు రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇండియన్ 2 నెక్ట్స్ ఆగష్టు 15కి వస్తే.. గేమ్ ఛేంజర్ వచ్చేది ఎప్పుడు..? అనేది ఆసక్తిగా మారింది. దీనిని బట్టి నెక్ట్స్ ఇయర్ దసరాకి గేమ్ ఛేంజర్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి.. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్స్ గురించి త్వరలో శంకర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్