First of its kind: చాలా గ్యాప్ తరువాత కమలహాసన్ తన సొంత బ్యానర్లో ‘విక్రమ్’ సినిమాను నిర్మించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూన్ 3వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన వెంకటేశ్ మాట్లాడుతూ .. “కమల్ సార్ ‘విక్రమ్’ ఫంక్షన్ కి రమ్మన్నారు .. రాకుండా ఎవరైనా ఉంటారా? కమల్ సార్ నటనకి 60 ఏళ్లు. కమల్ సార్ తమిళంలో తన తొలినాళ్లలో చేసిన పదహారేళ్ల వయసు’ చూశాను. ఆ సినిమా చూశాకా నేను క్లీన్ బౌల్డ్ ఐయ్యాను. ఇప్పటికీ ఆయన పదహారేళ్ల వయసులోనే ఉండిపోయారు.
కమల్ సార్ చేసిన ‘మరో చరిత్ర’ ప్రతి ఆర్టిస్టుకి ఒక జీపీఎస్ లాంటిది. ఆయన చేసిన ‘దశావతారం’ వంటి సినిమా చేయడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు. ఏక్ దూజే కేలియే’తో ఫస్టు పాన్ ఇండియా స్టార్ ఆయన. ఈ రోజున ఆయన గ్లోబుల్ స్టార్.కె. బాలచందర్ గారు .. కె. విశ్వనాథ్ గారు నుంచి ఇప్పటి వరకూ ప్రతి దర్శకుడు ఆయనతో సినిమా చేయడానికి ఇష్టపడతారు.’నాయకన్’ సినిమా.. నటనకు ఆయనను నాయకుడిని చేసేసింది. సౌత్ సినిమాను గురించి చెప్పుకోవాలంటే కమల్ సార్ కి ముందు … తరువాత అని చెప్పుకోవలసి ఉంటుంది. ఆయన యాక్టింగ్ చూసిన ప్రతి ఆర్టిస్ట్ .. ఇలా కూడా చేయవచ్చునా అనుకోకుండా ఉండలేరు.
కమల్ సార్ .. నటుడు .. దర్శకుడు .. సింగర్ .. రైటర్ .. కొరియోగ్రఫర్ .. ఇలా చెప్పుకుంటే పోతే దశావతారం కాదు .. శాతవతారాలు కనిపిస్తాయి. నేను ఇంతవరకూ యాక్షన్ సినిమాలు .. ఫ్యామిలీ సినిమాలు చేశాను.’గణేశ్’ .. ‘ధర్మచక్రం’ వంటి సెంటిమెంటల్ సినిమాలు చేయాలంటే, కమల్ సార్ సినిమాలు చూసి .. ఆ ఎక్స్ ప్రెషన్స్ ట్రై చేసేవాడిని. నేను ఇచ్చినవి ఆయన ఎక్స్ ప్రెషన్స్. ఆయనతో కలిసి పూర్తి స్థాయిలో ఒక సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా జూన్ 3వ తేదీన వస్తుంది .. మీరంతా ఈ సినిమా చూడాలి .. బ్లాక్ బస్టర్ చేయాలి” అంటూ ముగించారు.
Also Read : ఈ గెలుపు ఒంటరిగా సాధించింది కాదు: కమల్