Sunday, January 19, 2025
HomeTrending Newsరైతుల అభీష్టం మేరకే..కామారెడ్డి మాస్టర్ ప్లాన్ - మంత్రి వేముల

రైతుల అభీష్టం మేరకే..కామారెడ్డి మాస్టర్ ప్లాన్ – మంత్రి వేముల

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ కామారెడ్డి లో నోటికొచ్చినట్లు మాట్లాతున్నడని “నోరు జాగ్రత్త బండి సంజయ్” అని మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఏమీ చేయాలో నీతో చెప్పించు కోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదన్నారు. రైతులకు ఏమీ చేయాలో తమకు తెలుసని కేంద్రంలో ఉన్న నీ బీజేపీ ప్రభుత్వానికి నీ సలహాలు ఇవ్వు అని చురకలు అంటించారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మద్దతు ధర ఇవ్వక పోగా..ఎరువుల ధరలు మూడు రెట్లు పెంచి రైతుల నడ్డి విరుస్తోందన్నారు. ప్రశ్నించిన రైతులను వాహనాలతో తొక్కించి చంపిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రైతులను అరిగోసా పెడుతూ నిండా ముంచుతున్నారని ద్వజమెత్తారు.

రైతు కోసం మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్మరన్నారు. కేవలం రాజకీయ లబ్దికోసమే కామారెడ్డిలో బండి సంజయ్ డ్రామాకు తెరలేపాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ కి చేతనైతే కేంద్రంతో మాట్లాడి సిలిండర్ ధర తగ్గించు..వ్యవసాయ రంగం మీద వేసే పన్నులు తగ్గించు..ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తమన్న మోడీకి చెప్పి 15లక్షలు వేయించు..తెలంగాణ అభివృధ్ధిని అన్ని విధాల అడ్డుకుంటున్న మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి దమ్ముంటే మెడికల్ కాలేజీలు తీసుకురా అని మంత్రి సవాల్ చేశారు.

రైతుల రక్తాన్ని పీల్చుకుని తింటున్న రాకాసి బీజేపీ మాయ మాటలు దయచేసి రైతులు ఎవ్వరూ నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్నది రైతు ప్రభుత్వమని,రైతులను కడుపులో పెట్టుకొని కాపడుకుంటదని మంత్రి తెలిపారు. సంయమనం పాటించాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్