Sunday, November 24, 2024
HomeTrending Newsకామారెడ్డి రైతుల పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

కామారెడ్డి రైతుల పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రైతులు దాఖలు చేసిన పిటిషన్‎పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సమయం కోరారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు న్యాయస్థానం బుధవారం వరకు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.

అంతకముందు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై తుది నిర్ణయం చేయొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యధాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్