Saturday, November 23, 2024
HomeTrending Newsఅభిషేకం టిక్కెట్ల పెంపు లేదు : కాణిపాకం ఆలయ ఛైర్మన్

అభిషేకం టిక్కెట్ల పెంపు లేదు : కాణిపాకం ఆలయ ఛైర్మన్

కాణిపాకం ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యం వల్లే అభిషేకం టిక్కెట్ ధరను పెంచుతున్నట్లు ఓ అభిప్రాయ సేకరణ పత్రం విడుదలయ్యిందని, ఈ ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని ధర్మకర్తల మండలి  ఛైర్మన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  స్వయంభు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో అభిషేకం టికెట్ ధరను 700 రూపాయల నుంచి 5,000 రూ.లకు పెంచడానికి “RC.No.G1/2380/2011, Date:27/09/2022” తో అభిప్రాయ సేకరణ పత్రము విడుదల చశారు. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఈ స్థాయిలో పెంచడం సరికాదని, వెంటనే ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా నేడు దీనిపై స్పందించారు. అన్ని వైపులా నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నట్లు మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ ప్రకటనలో ముఖ్యాంశాలు:

  • శ్రీ స్వామివారి అభిషేకం ప్రస్తుతం జరుగుతున్న విధానమే యదావిధిగా నిర్వహించడం జరుగుతుందని, వీటిలో ఎలాంటి మార్పులు లేవని భక్తులకు ఈ సందర్భంగా తెలియజేయడమైనది.
  • దాతల సహాయసకారాలతో నూతనంగా సుందరంగా నిర్మించిన ఆలయంలో సామాన్యుల భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి అభిషేకం భక్తుల అందరికీ అందుబాటులో ఉండాలని నిర్ణయంతో ధర్మకర్తల మండలి “అభిప్రాయ సేకరణ పత్రము” సానుకూలంగా తిరస్కరించడమైనది.
  • ప్రస్తుతానికి ఆలయంలో ఎలాంటి టికెట్ ధరలను పెంచడం లేదు, దీనిపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాము,
  • శ్రీ స్వామివారి అభిషేకంలో భక్తులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను జరిపించుకునేలా ఆలయంలో ఏర్పాట్లు చేయడమైనది,
  • భక్తులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపాకటాచములకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము.

అంటూ ప్రకటన విడుదల చేశారు.

Also Readఅధర్మంగా ధర్మాదాయ శాఖ: సోము

RELATED ARTICLES

Most Popular

న్యూస్