కన్నా లక్ష్మీ నారాయణకు పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని బిజెపి నేత, రాజ్య సభ్య సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిందన్నారు. కొంత కాలం క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీద కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని, నేడు ఆయన చేసిన ఆరోపణలు కూడా సబబు కాదన్నారు. సోము వీర్రాజు ఏ నిర్ణయం తీసుకున్నా అవి కేంద్ర పార్టీ అనుమతితో, ప్రోద్భలంతో జరిగినవేనని, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు కావని స్పష్టం చేశారు.
తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించబోనని, ఎంపీగా తన బాధ్యతలకు లోబడి పని చేస్తున్నానని వెల్లడించారు. బిజెపిలో రాష్ట్ర అధ్యక్షుడి పదవి చాలా ప్రధానమైన హోదా అని, సాధారణంగా బైట పార్టీ నుంచి వచ్చిన వారికి అలాంటి పదవి ఇవ్వడం అనేది అరుదుగా జరుగుతుందని, కన్నాకు ఆ గౌరవం పార్టీ ఇచ్చిందని జీవీఎల్ వివరించారు.
Also Read : బిజెపికి కన్నా రాజీనామా, టిడిపిలో చేరిక!