Sunday, November 24, 2024
Homeసినిమాదీపావళి పోటీని తట్టుకుని నిలబడిన 'కాంతార'

దీపావళి పోటీని తట్టుకుని నిలబడిన ‘కాంతార’

‘కాంతార’ .. కన్నడలో సంచలనాన్ని నమోదు చేసిన సినిమా. 8 రోజుల్లో 50 కోట్లను .. 15 రోజుల్లో 100 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, 23 రోజుల్లో నే 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమాలో కన్నడ ప్రాంతానికి చెందిన ఆచార సంప్రదాయాలకు .. విశ్వాసాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆర్టిస్టులంతా కన్నడ ప్రాంతానికి చెందినవారే కావడం వలన, బలమైన కంటెంట్ ఉండటం వలన ఈ సినిమా అక్కడ రికార్డుస్థాయి వసూళ్లను సాధించడం సహజమే అనుకోవచ్చు. కానీ తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం చెప్పుకోదగిన విషయం. 10 రోజుల్లోనే ఈ సినిమా ఇక్కడ 25 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది.

ఈ కన్నడ అనువాద చిత్రంలోని ఆర్టిస్టులు తెలుగులో చాలామందికి తెలియదు. కథలో ప్రధానమైన అంశంగా చెప్పుకునే అక్కడి ఆచార విశ్వాసాల పట్ల అవగాహన కూడా ఇక్కడ తక్కువ. అయినా ఈ సినిమా కథాకథనాల పరంగా .. చిత్రీకరణ పరంగా ఇక్కడ జెండా ఎగరేసింది. ఎలాంటి పోటీ లేకుండా ఈ సినిమా థియేటర్లకు వస్తే ఇంతగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈ సినిమా విడుదలైన వారం రోజులకే దీపావళి సినిమాల పోటీని ఎదుర్కోవలసి వచ్చింది. ఒకటి కాదు నాలుగు సినిమాలను తట్టుకోవలసి వచ్చింది. ఆ జాబితాలో ‘జిన్నా’ … ‘ఓరి దేవుడా’ .. ‘ ప్రిన్స్’ .. ‘సర్దార్’ సినిమాలు ఉన్నాయి;.

ఈ నాలుగు సినిమాలలో ‘సర్దార్’ మాత్రమే డబ్బింగ్ మూవీగా వచ్చింది. అయినప్పటికీ కంటెంట్ పరంగా ‘సర్దార్’ గట్టిగానే నిలబడ్డాడు. కార్తి చేసిన ‘ఖాకీ’ .. ‘ఖైదీ’ స్థాయిలో కాకపోయినా, ‘సర్దార్’ కంటెంట్ ను కొట్టిపారేయలేం. అన్ని వైపులా నుంచి కథను అల్లుకుంటూ వస్తూ .. యాక్షన్ తో పాటు ఎమోషన్ ను కూడా వర్కౌట్ చేయగలిగారు. ఫైనల్ గా ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. అలాంటి సినిమాను కూడా తట్టుకుని ‘కాంతార’ దీపావళికి వసూళ్లను పెంచుకోగలిగింది. హీరో ఎవరైనా .. భాష ఏదైనా కంటెంట్ ఇంట్రస్టింగ్ గా ఉంటే హిట్టు పట్టుకొచ్చి దోసిట్లో పెడతామనే విషయాన్ని తెలుగు ఆడియన్స్ మరోమారు నిరూపించారనే చెప్పాలి.

Also Read : తెలుగులో ‘కాంతార’కి బ్రహ్మరథం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్