తెలంగాణ ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా 1500 డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకాలు చేపడుతోంది. ఈ ఉద్యోగాల నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ చేపట్టింది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఎంపిక నిర్వహిస్తున్నారు.జిల్లాల వారీగా పోస్టులు: ఆదిలాబాద్ – 33 భద్రాద్రి కొత్తగూడెం – 48 హన్మకొండ- 45 హైదరాబాద్ – 124 జగిత్యాల – 46 జనగామ – 26 జయశంకర్ భూపాలపల్లి – 25 జోగులాంబ గద్వాల – 25 కామారెడ్డి – 44 కరీంనగర్ – 48 ఖమ్మం – 55 కొమురం భీం ఆసిఫాబాద్ – 26 మహబూబాబాద్ – 38 మహబూబ్‌నగర్ – 45 మంచిర్యాల – 40 మెదక్- 40 మేడ్చల్ మల్కాజిగిరి – 75 ములుగు – 20 నాగర్ కర్నూల్ – 50 నల్గొండ – 74 నారాయణపేట – 24 నిర్మల్ -32 నిజామాబాద్ – 70 పెద్దపల్లి – 34 రాజన్న సిరిసిల్ల – 26 రంగారెడ్డి – 75 సంగారెడ్డి – 69 సిద్దిపేట – 45 సూర్యాపేట – 50 వికారాబాద్ – 42 వనపర్తి – 28 వరంగల్ – 44 యాదాద్రి భువనగిరి – 34 అర్హత: ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా లేదా కంప్యూటర్ పరిజ్ఞానం/ కంప్యూటర్ ఆపరేటర్ గా పని అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ. 19,500 ఉంటుంది. ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 15, 16 డిసెంబర్ 17న ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల. ఇంటర్వ్యూ వేదిక: సంబంధిత జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాలు/జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయాలు.
Also Read : జనవరి 18 నుంచి కంటివెలుగు-2