Saturday, November 23, 2024
HomeTrending NewsNH-563: కరీంనగర్ – వరంగల్ వాసులకు శుభవార్త

NH-563: కరీంనగర్ – వరంగల్ వాసులకు శుభవార్త

కరీంనగర్ – వరంగల్ మధ్య నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణీకులకు శుభవార్త. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషితో కరీంనగర్ – వరంగల్ (ఎన్ హెచ్-563) జాతీయ రహదారి పనుల విస్తరణకు మోక్షం కలిగింది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న వరంగల్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిత్యం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ రహదారిని 4 లేన్లుగా విస్తరించడంవల్ల ప్రజల ప్రాణాలకు భద్రత ఏర్పడటంతోపాటు వేగంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటంతో ప్రయాణీకులకు సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది.

68 కి.మీలు… 2,146 కోట్ల వ్యయం

కరీంనగర్ – వరంగల్ వరకు మొత్తం 68.015 కిలోమీటర్ల వరకు 4 లేన్ విస్తరణ పనులు కొనసాగనున్నాయి. భారతమాల పరియోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం 2 వేల 146 కోట్ల అంచనా వ్యయంతో ఈ 4 లేన్ నిర్మాణ పనులను చేపడుతోంది. దీనికి సంబంధించి భూ సేకరణ కూడా పూర్తయ్యింది. మొత్తం 325.125 హెక్టార్ల భూమిని సేకరించిన అధికారులు… బాధితులకు పరిహారం అందించే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. కరీంనగర్ – వరంగల్ మధ్య మొత్తం 30 గ్రామాల కవర్ అయ్యేలా ఈ 4 లేన్ రహదారి విస్తరణ పనులు కొనసాగనున్నాయి. ఈ విస్తరణ పనుల్లో భాగంగా 5 బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్