Saturday, June 13, 2026
HomeTrending Newsకర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం

కర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం

హైద్రాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందనీ, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా కొనసాగుతున్న హైద్రాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కన్నడిగుల కోసం హైద్రాబాద్ లో గల సాహిత్య వేదికను పునరుద్దరించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. హైద్రాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్నాటక వాసులు మరియు అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్జప్తి మేరకు సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైద్రాబాద్ కాచిగూడలో గల ‘కర్నాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లను సిఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు. సాహిత్య, సాంస్కృతక కార్యక్రమాలతో పాటు కమ్యునిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు సిఎం సూచించారు.
కాగా తమ విజ్జప్తి మేరకు రూ. 5 కోట్లను మంజూరు చేసినందుకు సిఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular