Sunday, January 19, 2025
Homeసినిమావిజయ్ .. ధనుశ్ బాటలోనే కార్తి!

విజయ్ .. ధనుశ్ బాటలోనే కార్తి!

ఇప్పుడు ట్రెండ్ మారింది .. కోలీవుడ్ హీరోలు నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇంతకుముందు .. తమిళంలో చేసిన తమ సినిమాలను ఇక్కడ రిలీజ్ అయ్యేలా చూసుకునేవారు. అయితే అలా ఎంత భారీ సినిమాను ఇక్కడ వదిలినా, డబ్బింగ్ సినిమా అనే ఒక ముద్ర నుంచి తప్పించుకోలేక పోయింది. పైగా అక్కడి హీరోలలో కొంతమందిని మాత్రమే తమ హీరోగా ఇక్కడి ప్రేక్షకులు భావించారు.

అందువలన తెలుగు ప్రేక్షకులు తమను ఓన్ చేసుకోవడానికీ .. టాలీవుడ్ లోను తమ మార్కెట్ పెంచుకోవడానికి గాను కోలీవుడ్ హీరోలు తెలుగు మేకర్స్ తో చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వంశీ పైడిపల్లి  – దిల్ రాజు కాంబినేషన్లో విజయ్ ‘వారసుడు’ (వరిసు) చేశాడు. దీనిని తెలుగు సినిమాగానే ప్రేక్షకులు భావించారు. థియేటర్ల దగ్గర గట్టిపోటీ  ఉన్నప్పటికీ ఆదరించారు. ఇదే పద్ధతిలో వెంకీ అట్లూరి – సూర్యదేవర నాగవంశీతో కలిసి ధనుశ్ ‘సార్’ (వాతి) సినిమాతో సక్సెస్ ను అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో కార్తి కూడా టాలీవుడ్ లో నేరుగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగిపోయాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను పరశురామ్ ఆల్రెడీ మొదలుపెట్టేశాడు. విజయ్ దేవరకొండతో చేయడానికి ఇంకా కొంత సమయం ఉండటంతో ఆయన కూడా కార్తి ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్లో జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇక మిగతా కోలీవుడ్ హీరోలు కూడా ఈ బాట పడతారని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరమే లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్