Saturday, January 18, 2025
Homeసినిమావాయువేగంతో కార్తికేయ హిట్ కొట్టేనా? 

వాయువేగంతో కార్తికేయ హిట్ కొట్టేనా? 

కార్తికేయ హీరోగా ‘భజేవాయువేగం’ రూపొందుతోంది. యూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డి పరిచయమవుతున్నాడు. కార్తికేయ సరసన నాయికగా ఐశ్వర్య మీనన్ కనిపించనుంది. రథన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, టీజర్ తో ఒక్కసారిగా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇది తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అనే విషయం అర్థమవుతుంది.

ఇప్పుడు కార్తికేయ దృష్టి అంతా కూడా ఈ సినిమాపైనా .. ఇది తీసుకొచ్చే రిజల్టుపైనే ఉంది. ఎందుకంటే ‘RX 100’ తరువాత కార్తికేయకి ఇంతవరకూ హిట్ పడలేదు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు హిట్ వైపు వెళతాయేమోనని అనుకుంటే, ఆ సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. ఇక చివరిగా వచ్చిన ‘బెదురులంక 2012’ సక్సెస్ కి కార్తికేయను మరింత దూరం తీసుకుని వెళ్లింది. దాంతో ఆయన కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో వస్తున్నాడు.

‘భజే వాయు వేగం’ టైటిల్ అయితే ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. కార్తికేయ మార్క్ యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ఉంటాయనే విషయం అర్థమైంది. గతంలో తండ్రీకొడుకుల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథలతో చాలానే సినిమాలు వచ్చాయి. మరీ ఈ ఎమోషనల్ డ్రామా ఎలా ట్రావెల్ అవుతుందనేది  చూడాలి. ఈ సినిమాతో తప్పకుండా కార్తికేయ హిట్ కొట్టవలసి ఉంటుంది. ఈ కంటెంట్ పై ఆయనపెట్టుకున్న నమ్మకం ఎంతవరకూ నిలబడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్