Sunday, January 19, 2025
Homeసినిమాకార్తికేయ కనిపించడేం?! 

కార్తికేయ కనిపించడేం?! 

హీరో కార్తికేయ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో మంచి హిట్  ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాతో అటు యూత్ నుంచి .. ఇటు మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. కార్తికేయకి ఆయన ఫిజిక్ .. డాన్స్ లో ఉన్న నైపుణ్యం ప్లస్ పాయింట్స్. ఇక ఆయన లుక్స్ విలనిజానికి కూడా సెట్ అయ్యేలా ఉండటం మరో ప్రత్యేకత. చాలామంది హీరోల్లా కెరియర్  ఆరంభంలో ఆయన అవకాశాల కోసం వెయిట్ చేయలేదు. చకచకా వచ్చిపడుతున్న అవకాశాలను చేసుకుంటూ వెళ్లిపోయాడు.

వరుసగా థియేటర్స్ కి వచ్చి పడుతున్న ఆయన సినిమాలు చూసిన వాళ్లంతా కూడా ‘కుర్రాడు మాంఛి స్పీడు మీద ఉన్నాడే’ అనుకున్నారు. అయితే కంటెంట్ ను ఎంపిక చేసుకునే విషయంలో ఆయన అంతగా శ్రద్ధ పెట్టకపోవడంతో వరుస పరాజయాలు పలకరిస్తూ వచ్చాయి. కుర్రాడు విన్న ప్రతి కథకి ఓకే చెప్పడమే ఇందుకు కారణమని అనుకున్నారు.  తెలుగులో ఆయన నుంచి ‘విక్రమార్కుడు’ వచ్చి ఏడాది కావొస్తోంది. కానీ ఆ తరువాత సినిమాను గురించిన అప్ డేట్స్ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఏం చేస్తున్నాడనేది తెలియడం లేదు.

గతంలో యంగ్ హీరోలందరి సినిమా  ఫంక్షన్ లలో కార్తికేయ కనిపించేవాడు. ఆ సినిమాలను గురించి తనకి తెలిసింది చెప్పేవాడు. కానీ ఈ మధ్య కాలంలో వేరే సినిమాల ఈవెంట్స్ లోను ఆయన కనిపించడం లేదు. తనకి సంబంధించిన ప్రాజెక్టులను గురించి చెప్పడం లేదు. దాంతో అందరూ కూడా ‘కార్తికేయ ఏమైపోయాడు? .. ఎక్కడా కనిపించడేం?’ అనుకుంటున్నారు. కార్తికేయ కంటెంట్ ఉన్న హీరోనే .. విలన్ రోల్స్ పరంగా కూడా విషయం ఉన్నవాడే. కానీ ఇక్కడ గ్యాప్ రాకుండా ప్లాన్ చేసుకోవాలి .. మీడియాలో కనిపించేలా చూసుకోవాలి. పరిచయాలే ఇక్కడ కెరియర్ ను పరిగెత్తిస్తాయనే విషయాన్ని గ్రహించాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్