Sunday, January 19, 2025
HomeసినిమాOscar: ఆస్కార్ ఖర్చు 80 కోట్లు కాదా.. మరి ఎంత..?

Oscar: ఆస్కార్ ఖర్చు 80 కోట్లు కాదా.. మరి ఎంత..?

ఆర్ఆర్ఆర్.. రికార్డు విషయంలో సంచలన సృష్టిస్తే… అవార్డుల విషయంలో చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ మూవీ 1200 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గోల్డన్ గ్లోబ్ అవార్డ్, ఆస్కార్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. అయితే… ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి టీమ్ ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రచారం జరిగింది. అంతే కాకుండా… ఆస్కార్ అవార్డ్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టడం వేస్ట్ అని… అదే 80 కోట్లతో ఓ పది సినిమాలు తీయచ్చు అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ చేయడం వివాదస్పదం అయ్యింది.

అయితే… ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ అంతా రాజమౌళి తనయుడు కార్తికేయ దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో కార్తికేయ ఆస్కార్ ప్రమోషన్స్ కు ప్రచారంలో ఉన్నట్టుగా 80 కోట్లు అవ్వలేదని…. 8 కోట్ల 50 లక్షలు మాత్రమే అయ్యిందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.  కార్తికేయ చెప్పిన ఈ బడ్జెట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి తన తెలివితేటలతో హాలీవుడ్ లో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రమోట్ చేసుకున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాకుండా… ఖర్చు చేస్తే ఆస్కార్ అవార్డు రాదని… అలా అనుకుంటే… ఇప్పటికే ఇండియాకి ఎన్నో ఆస్కార్ అవార్డులు వచ్చేవని చెప్పారు కార్తికేయ. ఏదేమైనా… రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ వెనుక ఉన్న కార్తికేయ అసలు బడ్జెట్ చెప్పడంతో ఇప్పుటి వరకూ చక్కర్లు కొట్టిన అన్ని రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్టయింది.

Also Read: నాగబాబు, రాఘవేంద్రరావుకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన తమ్మారెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్