Sunday, January 19, 2025
HomeTrending News110 కోట్ల కార్వీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడి

110 కోట్ల కార్వీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడి

కార్వీ స్కామ్‌లో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. సంస్థ ఎండి పార్థసారథికి చెందిన 110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. మనీలాండరింగ్ యాక్డ్‌ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ షేర్లు, భూములు, భవనాల షేర్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు జప్తు చేసింది. గతంలో 19 వందల 84.8 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఖాతాదారులకు చెందిన 2వేల 8వందల కోట్ల విలువైన షేర్లను కార్వీ తాకట్టు పెట్టి బ్యాంక్‌ లోన్‌ తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది. సీసీఎస్ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 2 వేల 95 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

నిబంధనలకు విరుద్దంగా కార్వీ ద్వారా వివిధ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన మదుపర్ల షేర్లు తమవేనని కార్వీ యాజమాన్యం వివిధ బ్యాంకుల నుంచి సుమారు 3,520 కోట్ల రుణాలు తీసుకుంది. ఆ రుణాన్ని దక్కించుకునేందుకు 20 పైగా డొల్ల కంపెనీలను సృష్టించారు. దీన్ని గమనించిన కొందరు మదుపర్లు సెబి దృష్టికి తీసుకెళ్ళి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి సెబి కార్వీ పై నిషేస్ధం విధించింది. రుణాలు తీసుకుని పార్థసారథి చెల్లించకపోవటంతో వివిధ బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ కేసులో కార్వీ ఎండి పార్థసారథి, సిఎఫ్ ఓ కృష్ణ హరి ని అరెస్ట్ చేయగా వారిద్దరూ ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చారు.

Also Read : క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్