Sunday, January 19, 2025
HomeTrending Newsఇసుక దోపిడీతో భద్రాచలం మునిగిపోయింది - రేవంత్ రెడ్డి

ఇసుక దోపిడీతో భద్రాచలం మునిగిపోయింది – రేవంత్ రెడ్డి

8 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది… కల్వకుంట్ల కుటుంబం అభ్యున్నతి కోసం, వారి ఆస్తులు పెంచుకొవడం కోసమే రాష్ట్రాన్ని ఉపయోగించుకున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ చేసిందని ఆయన అన్నారు. హైదరాబాద్ గాంధి భవన్ లో ఈ రోజు కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీకకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ పాలన తీరుపై మండిపడ్డారు.

కత్తి కార్తీక తన వంతు కృషి కాంగ్రెస్ పార్టీలో చేయాలని, పార్టీలో సముచిత స్థానం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. 10 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదు అయి గోదావరి ఉదృతం గా ప్రవహిస్తుందని, వర్షకాలం వస్తున్నప్పుడు మే నెలలోనే ఆయా శాఖలతో, మంత్రులతో సీఎం సమీక్ష చేయాల్సిందని అన్నారు. గతంలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరం ముఖ్యమంత్రులు పర్యవేక్షించే వారని, వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ , డిజాస్టర్ సమయంలో విపత్తు బృందాలను అప్రమత్తం చేసేదన్నారు. కేసీఆర్ సమీక్ష చేసినప్పుడు వైద్య ఆరోగ్య శాఖను కానీ డిజాస్టర్ బృందాలను ,ఆయా అధికారులను పిలవకుండా పార్టీ ఫిరాయింపులపై సమీక్ష చేశాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర పై మాట్లాడాడని విమర్శించారు.

సింగరేణి ఉద్యోగులు ఇతరులను కాపాడబోయి ఇద్దరు మరణించారని, కనీసం వారికి సంతాపం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు వచ్చే 20 నియోజకవర్గల్లో మీకు ఉన్న మంత్రులను ,ఆయా శాఖ అధికారులను అలెర్ట్ చేయాలని సూచించినా పట్టించుకోలేదన్నారు.  బాసర ట్రిపుల్ ఐటీ లో కలుషితమైన తిండి వల్ల 800 మంది రోగాల బారిన పడ్డారని, వారిని ఇంత వరకు పరమర్శించలేదన్నారు. ప్రభుత్వ దోపిడీ కి వందలాది మంది విద్యార్థులు బలవుతున్నారని, ప్రాజెక్టులు మునిగిన ,తెగిన వేల కోట్ల ప్రాజెక్టులు పోయిన పట్టింపు లేదు.. 11 లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయిందన్నారు.

సర్వేలు అన్ని మీకు సగమే చెబుతున్నాయి.. వంద స్థానాల్లో సగం అంటే మీరు సగం సచ్చినట్టే అని కెసిఆర్ ను ఉద్దేశించి అన్నారు. 18 నెలల తరువాత జరిగే ఎన్నికల మీద ఇప్పుడే మాట్లాడుతున్నావ్ అని మండిపడ్డారు. నేషనల్ డిజాస్టర్ బృందలను పంపించాలని ప్రధానికి కాంగ్రెస్ లేఖ రాసింది.. పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు.

ఇసుక దోపిడీ వల్లే భద్రాచలం మునిగిపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరదలకు కారణం కేసీఆర్ కుటుంబం ఇసుక దోపిడీ వల్లేనని, వరదల్లో ప్రజలు,పశువులు ఆస్తులు కొట్టుకుపోతుంటే జాతీయ రాజకీయాల పై సమీక్ష చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ దరిద్రం ఉన్నంత వరకు తెలంగాణ కు పట్టిన పీడ పోదని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణమే 2 వేల కోట్లు రిలీజ్ చేయాలని మోడీని డిమాండ్ చేస్తున్నఅన్న రేవంత్ రెడ్డి బండి సంజయ్ , కిషన్ రెడ్డి తక్షణమే మోడీ దగ్గర జాతీయ విపత్తుగా గుర్తుంచి 2 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read : వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం ఏరియల్ సర్వే

RELATED ARTICLES

Most Popular

న్యూస్