Kcr Comments Are Undemocratic Gajendra Singh Shekhawat :
తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థల పై దాడి అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో నా పేరుతో కొన్ని వ్యాఖ్యలు చేయటంతో నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని షెకావత్ ఢిల్లీ లో అన్నారు.
కేసీఅర్ కి జవాబు చెప్పందుకే ఈ మీడియా సమావేశమని, 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. 2020లో అక్టోబరు 6 వ తేదీన ప్రధాని మోడి ఆదేశాల ప్రకారం “అపెక్స్ కౌన్సిల్” సమావేశం నిర్వహించగా, ఉభయ తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం కోసం ఈ సమావేశం నిర్వహించాము.
సుప్రీంకోర్టులో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని కేసీఆర్ చెప్పారని, అలా చెప్పిన ఎనిమిది నెలల తర్వాత కేసును తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. ఇంతకాలం జరిగిన జాప్యానికి కేంద్రానిది ఎలా బాధ్యత అవుతుందన్నారు. నెల రోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడే మేము పని మొదలు పెట్టాం. కేసీఆర్ ప్రభుత్వం వేసిన పిటీషన్ వల్లనే ఇంత కాలం ఆలస్యము అయ్యిందని, కేసీఅర్ వల్లనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు వ్యవహరం ముందుకు పోవటం లేదని షెకావత్ వివరించారు.
ఏడు ఏళ్లుగా నేను ( కేంద్ర జలశక్తి మంత్రి) పట్టించు కోవటం లేదని అనడం తగదని, ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాతనే కృష్ణా, గోదావరి నదీ నిర్వహణ బోర్డుల ను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశామని షెకావత్ వెల్లడించారు. కేసీఅర్ ఇప్పుడు అబద్ధాలు, అనవసర రాద్దాంతం చేస్తున్నారని, కేసీఆర్ బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడటం తగదని హితవు పలికారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం ప్రక్రియను ప్రారంభించామని, లీగల్ ఒపీనియన్ కోసం న్యాయ శాఖకు లేఖ రాశామన్నారు. ఏపి, తెలంగాణ ల మధ్య ఉన్న జలవివాదాలను, ప్రాజెక్టు ల వారి కేటాయింపులను మాత్రమే కొత్త ట్రిబ్యునల్ విచారిస్తుందని షెకావత్ పేర్కొన్నారు.
Also Read :సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దు