Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం కెసిఆర్ కు స్వల్ప అస్వస్థత

సిఎం కెసిఆర్ కు స్వల్ప అస్వస్థత

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్థతతో  గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే అంతకుముందే.. సీఎం సతీమణి శోభ కూడా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో శోభ చికిత్స తర్వాత కేసీఆర్‌కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టు వచ్చిన తర్వాత.. కేసీఆర్‌కు ఉన్న సమస్యేంటో కుటుంబ సభ్యులకు వివరించారు. కాగా.. కేసీఆర్, శోభ ఇద్దరూ ఒకేసారి ఆస్పత్రికి వెళ్లడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో అసలేం జరుగుతోందో అర్థంకాక అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. కేసీఆర్‌కు వైద్య పరీక్షల తర్వాత ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి.
సీఎం కేసీఆర్‌కు ఉదయం పొత్తి కడుపులో అసౌకర్యం ఏర్పడింది. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆయన్ను ఏఐజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కేసీఆర్‌కు ఆస్పత్రి చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి‌‌ ఆధ్వర్యంలోని వైద్యబృందం పరీక్షలు చేసింది. కేసీఆర్‌కు సిటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించాము. పరీక్షల అనంతరం కడుపులో చిన్న పుండు ఉన్నట్టు గుర్తించాం. సీఎం ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలోనే ఉంది. ప్రాథమికంగా కొన్ని మందులు రెఫర్ చేశాం’ అని ఏఐజీ వర్గాలు ప్రకటనలో తెలిపాయి. సీఎం వెంట మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్.. ఎంపీ సంతోష్ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి సీఎం నివాసానికి మంత్రులు చేరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్