Sunday, January 19, 2025
HomeTrending Newsకెసిఆర్ ఆగమైతుండు - జగ్గారెడ్డి

కెసిఆర్ ఆగమైతుండు – జగ్గారెడ్డి

కెసిఆర్ ఎటూ కాకుండా పోతారని, కెసిఆర్ రాజకీయంగా డిస్ట్రబ్ అయ్యాడని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీజేపీనీ బలోపేతం చేసే పనిలో కెసిఆర్ పడ్డారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 200 ఎంపి సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, Trs కి వచ్చే ఎన్నికల్లో ఉన్న ఎనిమిది ఎంపి సీట్లు కూడా గెలవదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ లేకుండా దేశంలో ప్రత్యామ్నాం సాధ్యం అయ్యేది కాదని, Brs పెట్టీ…తెలంగాణ రాజకీయాన్ని బీజేపీ చేతిలో పెట్టాలని అనుకుంటున్నారు కెసిఆర్ అని మండిపడ్డారు.

కెసిఆర్ రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణలో trs గ్రాఫ్ పడిపోతుందని జగ్గారెడ్డి అన్నారు. మాయావతి కంటే… కెసిఆర్ పెద్ద లీడరా..? అన్న జగ్గారెడ్డి చక్రం తిప్పిన చంద్రబాబే సైలెంట్ గా ఏపీ కి పరిమితం అయ్యారని గుర్తు చేశారు. కెసిఆర్ కి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని, కాంగ్రెస్ లేదని…అన్నపుడే అర్థం చేసుకోవాలి.. అంటే కెసిఆర్ మానసికంగా బలహీనం గా ఉన్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

Also Read : మహిళా దర్బార్ మంచిదే – కాంగ్రెస్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్