Wednesday, July 3, 2024
HomeUncategorizedఐదు నెలల్ల తెలంగాణ ఆగమైంది - కెసిఆర్

ఐదు నెలల్ల తెలంగాణ ఆగమైంది – కెసిఆర్

ఐదు నెల‌ల కాలంలోనే తెలంగాణ ఆగ‌మైంద బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఒట్లు న‌మ్మేట‌ట్టు లేవని ఎద్దేవా చేశారు. మంచిర్యాల‌లో నిర్వ‌హించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఆదిలాబాద్‌ను ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని.. కానీ పార్లమెంటు ఎన్నికల తెల్లారే వాటిని రద్దు చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నాడని పేర్కొన్నారు.

కెసిఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

ఐదు నెల‌ల‌కు ముందు తెలంగాణ ఎట్ల ఉండే. ఈ ఐదు నెల‌ల్లోనే ఇంత ఆగం ఎందుకు అయిందో ఆలోచ‌న చేయాలి. ఐదు నెల‌ల కింద సాగునీళ్ల‌కు, మంచినీళ్ల‌కు, క‌రెంట్‌కు ఇబ్బంది లేదు.
సాగు, తాగునీరు, క‌రెంట్ విష‌యంలో ఈ ఐదు నెల‌ల్లోనే ఎలాంటి మార్పులు వ‌చ్చాయో గ‌మ‌నించాలి. కేసీఆర్ ఉన్న‌ప్పుడు, బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు రెప్ప‌పాటు కూడా క‌రెంట్ పోలేదు. మ‌రి ఇవాళ ఎందుకు క‌రెంట్ కోత‌లు స్టార్ట్ అయ్యాయి.

అడ్డ‌గోలు హామీలిచ్చిన‌ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుని మీద ఒట్టు పెడుతున్నాడు. ఈ ఒట్టు న‌మ్మేటట్టు ఉన్న‌దా..? అంటే లేదు. కాంగ్రెస్ నాయ‌కులు ఏమీ చేయ‌రు అని మ‌న‌కు అర్థ‌మైంది అని కేసీఆర్ తెలిపారు.

చెన్నూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఆపేశారు. మంచిర్యాల ప్ర‌జ‌ల కోసం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరు చేస్తే అది మొండి గోడ‌ల‌తో క‌న‌బ‌డుతుంది. దాన్ని ఎందుకు ఆపేసింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్రారంభించిన అన్ని ర‌కాల ప‌నుల‌ను నిలిపివేశారు. కేసీఆర్ ఆన‌వాళ్లు లేకుండా చేస్తా, మంచినీళ్ల స్కీమ్‌ కూడా ఆపేస్తామని మూర్ఖంగా అంటున్నాడు సీఎం.

అన్ని రకాల రెసిడెన్షియల్‌ పాఠశాలల పెట్టినం. ఇవాళ వాటిని చూసే దిక్కులేదు. పిల్లలు విషాహారం తిని ఆస్పత్రి పాలవుతున్నారు.. కొన్నిచోట్ల చనిపోతున్నారు. అన్ని రకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి మూర్ఖ వైఖరితో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తోంది.

గోదావరి నదిని ఎత్తుకుని పోతా అని నరేంద్ర మోదీ అంటున్నాడు. మీకు అన్యాయం చేస్తానని మోదీ అంటుంటే.. ఈ ముఖ్యమంత్రి ఏమో ఏం మాట్లాడట్లేదు.. కృష్ణానదిని ఆల్రెడీ కేంద్రానికి అప్పగిచ్చిండు. ఇవాళ గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకు ఇస్తా అంటే కూడా నోరు తెరవట్లేదు. కృష్ణా, గోదావరి నదులు పోతే మనల్ని ఎవరు కాపాడాలని అడిగారు. అందుకే ఇవాళ బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

వీటి మీద నిలదీస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్‌ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడలేసుకుంటా.. నీ లాగుల తొండలు సొరకొడుతా.. నిన్ను జైల్లో పెడతా అంటున్నాడు. జైళ్లకు కేసీఆర్‌ భయపడతాడా? నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా?

ఈ అన్యాయాలను అరికట్టాలంటే.. మనకు న్యాయం జరగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారం చివరి దశకు చేరుతున్న సమయంలో కెసిఆర్ మాటల తూటాలు పదునేక్కాయి. బేషేజాలకు పోకుండా బీఆర్ఎస్ ఆవశ్యకతను ఓటర్లకు సూటిగా వివరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్