Saturday, January 18, 2025
HomeTrending Newsదసరా నాటికి భారతీయ రాష్ట్ర సమితి ?

దసరా నాటికి భారతీయ రాష్ట్ర సమితి ?

దేశంలో కొత్త వ్యవసాయ విధానం రావాలని రైతులు కోరుకుంటున్నారని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.  దేశంలో వ్యవసాయం పండగ కావాలంటే తెలంగాణ మోడల్ అంతటా అమలు కావాలన్నారు. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు రాజేశ్వర్ రావు, జనార్దన్ రెడ్డి లు ఈ రోజు టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ  కేసీఆర్ తో ఇటీవల భేటీ ఆయిన రైతు సంఘాల నేతలకు ఉద్యమాల చరిత్ర ఉందన్నారు. మోడీకి బీజేపీకి రైతుల ప్రయోజనాలు పట్టడం లేదని…ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే మోడీ పనిగా మారిందని విమర్శించారు.

దేశంలో అంతటా బీజేపీ ప్రభ్యత్వాలు ఉండాలని మోడీ కుట్ర పన్నారని, బీహార్ లో బీజేపీ కుట్ర ను పసిగట్టి నితీష్ కుమార్ ఆ పార్టీ కి దెబ్బ కొట్టి ఆర్ జే డీ తో కలిశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా బీజేపీ కుట్రను భగ్నం చేశారన్నారు. ఝార్ఖండ్ లో బీజేపీ కుట్రలు ఎదురుకుని సొరేన్ నిలబడతారని నమ్మకం ఉందన్నారు. ఇక్కడ కూడా చిచ్చు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీహార్ సీఎం నితీష్ కేసీఆర్ పాలన పై పొగడ్తలు కురిపించారని, మిషన్ భగీరథ లాంటి పథకం తక్కువ కాలంలో అమలు చేసి చూపారని నితీష్ ప్రశంసించడం సంతోషకరమన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటోందని, తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ ను తుత్తనీయలు చేసిందన్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులకు సాయం చేయడాన్ని కేవలం సంకుచిత మనస్తత్వం ఉన్న వారే విమర్శిస్తారన్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ సభలు, సమావేశాలపై ఇంకా నిర్ణయం జరగలేదన్నారు. కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటన పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని, రైతుల కు సంబంధించి ఒక బలమైన వేదిక ఏర్పాటు అయ్యాకే సభలు సమావేశాలు ఉంటాయన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటన పై బీజేపీ ఐటీ సెల్ చిల్లర ప్రచారం చేస్తోందని విమర్శించారు. దమ్ముంటే బీజేపీ జాతీయ నేతలు కేసీఆర్ తో ఏ అంశంపై నైనా చర్చకు రావాలని సవాల్ చేశారు. తమకు అస్సలు బలం లేని చోట కూడా బీజేపీ ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ నాయకత్వం కుట్రలను ఎప్పటికపుడు చేధిస్తామని, తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడటానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కు సిగ్గుండాలన్నారు. కేసీఆర్ దగ్గర బీజేపీని ఎదుర్కొనే అస్త్రాలు చాలా ఉన్నాయి. విద్యుత్ బకాయిల పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసు నిబంధనల ప్రకారం చెల్లదు, కోర్టులో ఈ అంశాన్ని తేల్చుకుంటాం.

ఈ నెల 3 న జరిగే టీ ఆర్ ఎస్ ఎల్పీ సమావేశంలో ఎజెండా ఏమిటన్నది ఇదివరకే ప్రకటించామని, ఎజెండాలో లేని అంశాలు కూడా చర్చకు రావచ్చని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. బీ.ఆర్.ఎస్ దసరా కల్లా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అసెంబ్లీ రద్దు అనేది పెద్ద నిర్ణయం.. దీనిపై చెప్పేటంత పెద్ద వాడిని కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్