Sunday, February 23, 2025
HomeTrending Newsదళితబందు నిధుల విడుదల

దళితబందు నిధుల విడుదల

 Dalitbandu Funds :  దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది.
విడుదలైన నిధుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలంలో దళిత బంధును సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు రూ. 50 కోట్లు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళిత బంధు అమలు కోసం రూ.100 కోట్లు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలంలో దళిత బంధు అమలుకోసం రూ. 50 కోట్లు.,
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలంలో దళిత బంధు అమలుకోసం రూ. 50 కోట్లను … ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పోరేషన్ మంగళవారం జమచేసింది.

Also Read : రైతుల కోసం ఢిల్లీ వచ్చాం

RELATED ARTICLES

Most Popular

న్యూస్