Saturday, November 23, 2024
HomeTrending Newsసొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దు

సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దు

KCR Ultimatum To The Center On Anti Farmer Laws :

రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రానికి కేసీఆర్ అల్టిమేటం ఇచ్చారు. ఉత్తర భారతదేశంలో ఉన్న రైతులకు మద్దతుగా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. ఇక నుండి కేంద్రానికి చుక్కలే… నిద్ర పోనివ్వమన్నారు కేసీఆర్. ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెబుతోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్ లో మీడియాతో మాట్లాడుతూ అందుకే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి చెప్పారని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. మిషన్‌ కాకతీయతో చెరువులను అద్భుతంగా తీర్చిదిదద్దుతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నీటి వాటాల విషయంలో ఇప్పటివరకు కేంద్రం నోరు మెదపలేదు. 157 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

బండి సంజయ్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నాడని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. సంజయ్‌కు నెత్తిలేదు, కత్తిలేదంటూ ఫైరయ్యారు. తనని జైలుకి పంపుతా అని బండి సంజయ్ అంటున్నాడని.. అంత ధైర్యం ఉన్నవాళ్లు ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు. టచ్ చేస్తే తమ పవర్ ఏంటో తెలుస్తుందన్నారు. నాలుక ఉంది కదా అని మాట్లాడితే మెడలు విరుస్తామన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిదంటున్న బండి సంజయ్ దమ్ముంటే తన మీద కేసు పెట్టాలన్నారు.  అక్షరం ముక్కరాదు. హిందీ రాదు.ఇంగ్లీష్ ముక్క రాదు… కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే జీవోలు వీరికి అర్థం కావన్నారు. కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి రాష్ట్రానికి బండి సంజయ్ ఏం చేశాడని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చిన్నాపెద్దా ఏమీ లేదా? ముఖ్యమంత్రిని, మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడతారా? అనేక విషయాల్లో కేంద్రంలో మీ ప్రభుత్వం ఫెయిలవలేదా? అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. మేమిచ్చిన డబ్బుతోనే కేంద్రం నడుస్తోంది. గుర్తుంచుకోండి అంటూ స్టేట్ బీజేపీ లీడర్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఉండి.. అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్‌ ఎవరి మెడలు వంచుతారో చెప్పాలని నిలదీశారు. ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా? అనే స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు.  ఓవైపు.. మొత్తమే కొనమని రాతపూర్వకంగా కేంద్రం లేఖలు ఇస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నాయకులు పండించాలని రైతులను అయోమయంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.

కిషన్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్

కిషన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.  కేంద్రమంత్రి హోదాలో హుందాగా మాట్లాడాలని సూచించారు. ‘నేను కూడా కూడా కేంద్ర మంత్రిగా పని చేశా.. పెద్ద పదవి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. హుజురాబాద్‌లో కిషన్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం తమదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగిందన్నారు. కరోనా కాలంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం నిలువ చేసే భారీ, శాస్త్రీయ గోదాములు రాష్ట్రంలో ఉండవని తెలిపారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వద్దని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారని.. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో వరి వద్దన్నారని వివరించారు. అనేక పెట్టుబడులు పెట్టి 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని..  ప్రపంచంలోనే ఎక్కడాలేని రైతుబంధు తీసుకువచ్చామని కేసీఆర్ చెప్పారు. రైతుబీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. గతంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సరిగా దొరికేవి కావని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ ప్రకటించారు. కల్తీ విత్తనాలమ్మేవారిపై పీడీ యాక్టు తెచ్చిన సర్కారు తమదే అన్నారు సీఎం. రైతులను గందరగోళానికి గురి చేస్తే బండి సంజయ్ ఆట కట్టిస్తామని చెప్పారు. సిల్లి బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు రైతులు నమ్మొద్దని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: కాంగ్రెస్, బీజేపీలు దోపిడీ పార్టీలు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్