Sunday, January 19, 2025
HomeTrending Newsఉకదంపుడు ఉపన్యాసాలు మానుకో కెసిఆర్ - బిజెపి

ఉకదంపుడు ఉపన్యాసాలు మానుకో కెసిఆర్ – బిజెపి

KCR Unparliamentary Language :

తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులు ఈ రోజు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు దమ్ముంటే మంత్రులు, ఎమ్మెల్యేలతో పరేడ్ గ్రౌండ్ లో పరేడ్ చేయిస్తే అందరి బండారం బయట పడుతుందన్నారు. ధర్మం కోసం దేశం కోసం పోరాడిన పార్టీ బిజెపి అన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పిన కెసిఆర్ గతంలో ఆయా రాష్ట్రాల్లో దైవ దర్శనాలు చేసుకొని వచ్చారని, ఇప్పుడు యుపి ఎన్నికలకు వెళతానని చెప్పి అయోధ్య సందర్శించుదాం అంటే ఆయనకు ఎందుకో కుదరలేదని సంజయ్ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాల్గొన్నారు. బిజెపిని విమర్శించెందుకే కెసిఆర్ జనగామలో బహిరంగసభ పెట్టారని సంజయ్ విమర్శించారు. దేశ ప్రధాని మీద కెసిఆర్ వ్యాఖ్యలు అక్షేపనీయమన్నారు. నీరవ్ మోడీ విదేశాలకు వెళ్లి ఉండొచ్చు కాని అవినీతి కెసిఆర్ ను మాత్రం విదేశాలకు వేల్లనీయమని, దేశంలోనే ఉంటామని సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి పదవి నుంచి మోడీ ని ఎందుకు దించాలో కెసిఆర్ చెప్పాలన్నారు.

ఉకాదంపుడు ఉపన్యాసాలు కెసిఆర్ మానుకోవాలని హితవు పలికారు. కెసిఆర్ మాట్లాడే భాష తెలంగాణాలో ఎవరు వాడరు. సిఎం స్థాయి వ్యక్తి మాట్లాడే భాష అలా ఉండదన్నారు. ప్రధాని మీద వ్యాఖ్యలు, 317 జీవో అమలులోకి తేవటం,  రాజ్యాంగం మీద కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు తదితర అంశాల్లో కెసిఆర్ భేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ ల పేరుతో సింగరేణి కార్మికుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాలను వెంటనే విడుదల చేసి వారికి తగిన వైద్య సహాయం అందించాలి.

Also Read : ఢిల్లీ కోట బద్దలు కొడతాం – కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్