Friday, November 22, 2024
HomeUncategorizedకెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుంది

కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుంది

హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కోవిడ్ పేరుతో ఎన్నికలు నిర్వహించొద్దంటూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిండు. సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. బార్లు, బడులు ఓపెన్ చేస్తారు. సభలు జరుపుతారు. కానీ హుజూరాబాద్ ఎన్నికలకు మాత్రం కోవిడ్ అడ్డమొచ్చిందా అని దుయబట్టారు. ఓడిపోతామనే భయంతోనే వాయిదా వేయించిండు. ఈ ముఖ్యమంత్రి పాలనను తరిమికొట్టే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు.  అవినీతి, కుటుంబ, గడీల, నయా నిజాం పాలనను ఎదుర్కొనే పార్టీ బీజేపీ మాత్రమే. అందుకే ప్రజా సంగ్రామ యాత్రకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నరు. అక్టోబర్ 2 వరకు పాదయాత్ర చేసి తీరుతామని బండి సంజయ్ ప్రకటించారు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని గాంధీ చౌరస్తా వద్ద జరుగుతున్న సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శ్రుతి, ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీ శైలంగౌడ్, సంగారెడ్డి ఇంఛార్జ్ దేశ్ పాండే, రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు  ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. అరవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే.

‘కరోనాతో అనేక మంది చచ్చిపోయినా నాగార్జున సాగర్ ఎన్నికలు జరిపిండ్రు. ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం ఎన్నికలు జరిపిండ్రు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గిపోయినయ్. కానీ హజూరాబాద్ ఎన్నిక మాత్రం పెట్టొద్దట. బార్లు, స్కూళ్లు అన్నీ తెరుస్తరట. ఎన్నికలు వద్దట. కేసీఆర్ ఎంత పిరికివాడో అర్ధమవుతోంది. ఈ మధ్య ప్రధాని మోదీని 50 నిమిషాలు కలిసినని కేసీఆర్ చెబుతుండు. మూడున్నర కోట్ల ప్రజల మీదున్న ప్రేమతోనే మీకు 50 నిమిషాలపాటు ప్రధాని టైమిచ్చిండు. నా ఇద్దరి పిల్లలకు కూడా అర్ధ గంట టైమిచ్చిండు. అల్లరి బాగా చేస్తరని చెవులు పిండిండు.

రేవంత్ పనికిమాలినోడు. సోనియాను నేను తిట్టినట్లు చెబుతుండు. కానీ సోనియాను, వైఎస్ ను తిట్టినతిట్టు తిట్టినోడు. భూమికి జానెడు లేనోడు అమ్మ నా బూతులు తిడుతూ సెప్టిక్ ట్యాంక్ మాదిరిగానే తయారైండు. రేవంత్-కాంగ్రెస్ కాంబినేషన్ స్మశానానికి కాటికాపరి ఎట్లనే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి అట్ల తయారైండు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ… ‘‘రాష్ట్రానికి మెతుకు పెట్టిన మెదక్ ను కేసీఆర్ కు కన్నుకుట్టి జిల్లాను మూడు ముక్కలు చేసిండు. కొత్త జిల్లాలు వస్తే ఉద్యోగాలొస్తయనుకన్నం. కానీ ఒక్కటీ రాలేదు. ఎన్నో కంపెనీలు ఇక్కడే ఉన్నయ్. భూములు మనయ్. కొలువులు పరాయి వాళ్లకు ఇస్తున్నరు.

ఫకీరోళ్లు, పిట్టల దొరలు చాలా మాట్లాడుతున్నరే తప్ప ఈ జిల్లా అభివ్రుద్దికి చేసిందేమీ లేదు. కనీసం ఇంటింటికీ నీళ్లు రావడం లేదు. కానీ బీర్ల కంపెనీలు మాత్రం ఇక్కడ ఉంటున్నయ్. ఏం ఇక్కడి ప్రజలకు నీళ్లు వద్దా….బీర్లు తాగి బతకాలా? తాగు…తిను…పడుకో అన్నట్లుగా కేసీఆర్ పాలన ఉంది. అందుకే బడులు బంద్ పెట్టి బార్లు తెరిచారు. ’’అని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్