Saturday, January 18, 2025
Homeసినిమాక‌ళ్యాణ్ రామ్ వెర్సెస్ నిఖిల్.?

క‌ళ్యాణ్ రామ్ వెర్సెస్ నిఖిల్.?

Keen Contest: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఓవైపు హీరోగా న‌టిస్తూనే.. మ‌రో వైపు నిర్మాత‌గా రాణిస్తున్నాడు.  ఆయన తాజా చిత్రం బింబిసార‌. వ‌శిష్ట్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇది క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ. దీనికి త‌గ్గ‌ట్టుగా భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ టీజ‌ర్ చూస్తుంటే.. ఈసారి క‌ళ్యాణ్ రామ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ప‌క్కా అనిపిస్తుంది. అంత‌లా బింబిసార టీజ‌ర్ ఆక‌ట్టుకుంది.అయితే.. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ఆగ‌ష్టు 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల సమయానికి నిఖిల్ కార్తికేయ 2 వ‌స్తుంద‌ని.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌ళ్యాణ్ రామ్, నిఖిల్ సినిమాలు పోటీ ప‌డ‌నున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. కార్తికేయ 2 చిత్రాన్ని జులై 22న రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. కాని అదే జూలై 22 వ తారీకున నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.

ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేసేది లేదంటూ నిర్మాత దిల్ రాజు భీష్మించుకు కూర్చున్నాడు. అదే సమయంలో సోలో రిలీజ్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. థాంక్యూ సినిమా సోలో రిలీజ్ కోసం కార్తికేయ 2 ను వాయిదా వేసుకోవాల్సిందిగా మేకర్స్ కు దిల్ రాజు సూచించడంతో పాటు ఒకింత ఒత్తిడి తెస్తున్నాడనే చెప్పాలి. అందువ‌ల‌న కార్తికేయ 2 ఆగ‌ష్టు 5న రానుంద‌ని.. ఈవిధంగా క‌ళ్యాణ్ రామ్, నిఖిల్ మ‌ధ్య పోటీ ఏర్ప‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే.. ఈ పోటీలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో చూడాలి.

Also Read క‌ళ్యాణ్ రామ్ కోరిక నెరవేరేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్