Sunday, January 19, 2025
HomeసినిమాKeerthy Suresh: హీరో ఊర మాస్ .. హీరోయిన్ పక్కా మాస్!

Keerthy Suresh: హీరో ఊర మాస్ .. హీరోయిన్ పక్కా మాస్!

మాస్ పాత్రలను హీరోలు పోషించడం చాలా కాలం నుంచి వస్తున్నదే. కొన్ని సినిమాల్లో హీరో ఎంత ఊరమాస్ గా ఉన్నప్పటికీ, హీరోయిన్ ను మాత్రం చాలా గ్లామరస్ గానే చూపించేవారు. హీరోయిన్ కలవారి కుటుంబంలో పుట్టినా, హీరోలోని మంచి లక్షణాలకు పడిపోయినట్టుగా చూపించేవారు.   మరికొన్ని సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్ ను కూడా మాస్ గానే చూపించారు. హీరోతో పాటు హీరోయిన్ కూడా అదే ప్రాంతంలో పుట్టి పెరగడం వలన కథ ప్రకారం అలా కనిపించడమే కరెక్టు అని ఆడియన్స్ కూడా సర్దుకుని చూసేవారు.

ఈ మధ్య కాలంలో ఈ రెండో అంశానికి సంబంధించిన కథలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా ఒక గిరిజన గూడానికి చెందినవారిగానో .. మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందినవారిగానో చూపిస్తున్నారు. ఇలా వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్టు అవుతున్నాయి కూడా. ‘రంగస్థలం’ .. ‘పుష్ప’ సినిమాలను అందుకు నిదర్శనంగా తీసుకోవచ్చు. ఈ సినిమాల్లో కథానాయికలు మాస్ హీరోకి తగినట్టుగా కనిపించినా ప్రేక్షకులు ఆదరించారు .. భారీ విజయాలను కట్టబెట్టారు.

అదే రూట్లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘దసరా’ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఇంతవరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత ఊర మాస్ లుక్ తో నాని కనిపించనున్నాడు. ఆయనకి ఎంతమాత్రం తగ్గేది లేదన్నట్టుగా గ్రామీణ యువతిగా కీర్తి సురేశ్ అరించనుంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ముద్దుగా .. బొద్దుగా కీర్తి సురేశ్ ను చూస్తూ వచ్చినవారికి, ఆమెను ఇలా చూడటం కష్టమే కావొచ్చు. కానీ కథను ఫాలో అవుతూ ఉంటే కన్వీన్స్ కావొచ్చు. డీ గ్లామర్ రోల్ లో కీర్తి సురేశ్ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్