Sunday, January 19, 2025
Homeసినిమాకీర్తి సురేశ్ ఎక్కడా కనిపించదేం?!

కీర్తి సురేశ్ ఎక్కడా కనిపించదేం?!

‘సర్కారువారి పాట’ తరువాత కీర్తి సురేశ్ ఇంతవరకూ తెలుగు తెరపై కనిపించలేదు. ఆ తరువాత ఆమె చేసిన సినిమా ‘దసరా’నే. నాని హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఆయన జోడీగా ఆమె కనిపించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘నేను లోకల్’ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అందువలన సహజంగానే ‘దసరా’పై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఈ ఇద్దరూ ఎలా సందడి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను మార్చి 30వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్టర్స్ లో గానీ ..  టీజర్ లో గానీ .. సాంగ్స్ లో గాని కీర్తి సురేశ్ కనిపించడం లేదు. అసలు ఈ సినిమాలో కీర్తి ఎలా కనిపించనుందనే విషయమే తెలియడం లేదు. కేవలం నాని రోల్ ను మాత్రమే హైలైట్ చేస్తూ వెళుతున్నారు.

ఈ సినిమాలో నానితో పాటు ఇంతవరకూ ఎక్కువగా కనిపించింది సిల్క్ స్మిత పోస్టర్. అందుకు కారణం ఏమిటని అడిగితే తెరపైనే చూడాలని మొన్న స్టేజ్ పై నాని అన్నాడు. పైగా డైరెక్టర్ ఆమెకి అభిమాని అని చెప్పాడు. కీర్తి సురేశ్ గురించి ప్రస్తావిస్తే, ఈ సినిమా తరువాత తమ పాత్రలను గురించి మాట్లాడుకుంటారని అన్నాడు. సస్పెన్స్ లో ఉంచాలనే ఉద్దేశంతో ఆమె రోల్ ను చూపించడం లేదా? లేదంటే ఎక్కడైనా తేడా కొట్టేసిందా? అనేదే అందరిలో సందేహాన్ని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన అవసరం కీర్తి సురేశ్ కి కూడా ఎక్కువగానే ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్