Sunday, January 19, 2025
HomeసినిమాKeerthy Suresh Marriage: కీర్తి సురేష్‌ పెళ్లి గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారుగా..

Keerthy Suresh Marriage: కీర్తి సురేష్‌ పెళ్లి గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారుగా..

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది కీర్తి సురేష్‌. ఇటీవల ‘దసరా’ సినిమాతో సక్సెస్ సాధించింది. ఈ మూవీలో కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్రతో మెప్పించింది. ఇక తమిళంలో చేసిన ‘సానికాయుధం’ మూవీ అయితే.. పూర్తి డీగ్లామర్ రోల్ లో నట విశ్వరూపం చూపించింది. ఈ కారణంగానే కీర్తి సురేష్ అని అందరూ మహానటితో పోలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో చిరుకు చెల్లెలు పాత్రలో ఆమె కనిపించనుది.

గత కొంత కాలంగా కీర్తి సురేష్ పెళ్లి పై తెగ వార్తలు వస్తున్నాయి. ఆమెకి ఒక బిజినెస్ మెన్ తో పెళ్లి సంబంధం ఫిక్స్ చేసినట్లు ముందుగా ప్రచారం జరిగింది. దానికి కీర్తి సురేష్ తల్లి క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలను ఖండించింది. అయితే తాజాగా ఆమె ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి. అందులో ఉన్న వ్యక్తి కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే.. వాటి పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. అతను తన బెస్ట్ ఫ్రెండ్ ఫర్హాన్ అని తెలిపింది. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేసే ముందు ఒకసారి చూసుకోండి అని సలహా ఇచ్చింది.

ఇప్పుడు కీర్తి సురేష్‌ తండ్రి మలయాళీ నిర్మాత సురేష్ స్పందించారు. తమ కూతురు కీర్తి సురేష్ ఎవరితో లవ్ లో లేదని ఆమె బర్త్ డే రోజు ఫ్రెండ్ ఫర్హాన్ తో తీసుకున్న ఫోటోల పై తప్పుడు ప్రచారం చేసారంటూ పేర్కొన్నారు. ఆ అబ్బాయి తమకి భాగా తెలుసని క్లారిటీ ఇచ్చారు. ఒక వేళ కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే మేమే తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తల కారణంగా తమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిందని అన్నారు. అయితే.. కీర్తి సురేష్ మాత్రం సమయం వచ్చినప్పుడు రియల్ మిస్టరీ మేన్ ను బయటపెడతానని చెప్పింది. దీంతో.. కీర్తి మనసు దోచుకున్న ఆ మిస్టరీ మేన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్