Saturday, November 23, 2024
HomeTrending NewsAAP vs BJP: ఢిల్లీలో ఉద్యోగుల ఆర్డినెన్స్‌ పై సుప్రీంలో విచారణ

AAP vs BJP: ఢిల్లీలో ఉద్యోగుల ఆర్డినెన్స్‌ పై సుప్రీంలో విచారణ

ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. బదిలీలు, పోస్టింగుల విషయంలో తుది నిర్ణయం తీసుకునే హక్కును కేంద్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కట్టబడుతూ నేషనల్‌ క్యాపిటర్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఆర్డినెన్స్‌ మేరకు DANICS కేడర్‌కు చెందిన గ్రూప్-ఏ అధికారుల బదిలీ, క్రమశిక్షణా చర్యల కోసం నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అథారిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, ఢిల్లీ ఎల్‌జీ సభ్యులుగా ఉంటారు. కేంద్రం ఢిల్లీ, అండమాన్‌-నికోబార్‌, లక్షద్వీప్‌, డామన్‌ అండ్‌ డయ్యూ దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులంతా DANICSలో చేర్చింది. అయితే, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై తుది నిర్ణయం లెఫ్టినెంట్‌ గవర్నర్‌దే. అయితే, బదిలీలు, పోస్టింగ్‌ అధికారాన్ని కట్టబెట్టేందుకు అంగీకరించడం లేదు. అంతకు ముందే ఢిల్లీలోని పాలనపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఢిల్లీలో ప్రభుత్వం నిర్వహించాల్సిన కార్యనిర్వాహక విధులను ఎల్‌జీ ద్వారా కేంద్రం నియంత్రిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని కేజ్రీవాల్‌ సర్కారు ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. మే 11న కీలక తీర్పు ఇచ్చింది.

పోలీస్‌, పబ్లిక్ ఆర్డర్, భూ వ్యవహారాలు మినహా ఢిల్లీలోని మిగతా అన్ని శాఖలు, విభాగాలు, సేవల నియంత్రణపైన పూర్తి అధికారం.. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, కేంద్రం తీర్పును పక్కనపెట్టిన మోదీ సర్కారు ప్రత్యేకంగా ఈ మే 19న ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును ఈ నెలలో జరిగే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ విషయంలో కేజ్రీవాల్‌ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టారు. కేంద్ర ప్రభుత్వం తీరును పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించింది. ఈ నెల 11న విచారించనున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్