Sunday, January 19, 2025
Homeసినిమా‘కేజీయఫ్ ఛాప్టర్ 2’...ఏప్రిల్ 14, 2022న గ్రాండ్ రిలీజ్

‘కేజీయఫ్ ఛాప్టర్ 2’…ఏప్రిల్ 14, 2022న గ్రాండ్ రిలీజ్

“తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం..
ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీ భాయ్‌..”

‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ తో న‌‌రాచిలో మొద‌లైన రాకీభాయ్ దండ‌యాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి రాకీభాయ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నాడు.. ఇంత‌కీ ఈ రాకీభాయ్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. రాకింగ్ స్టార్ య‌ష్‌….
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా క్రేజీ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచనాలతో రూపొందుతోన్న మూవీ ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 200 మిలియన్ వ్యూస్‌కు పైగా 8.6 మిలియన్ లైకులతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. ఆ అంచనాలకు ధీటుగా ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2’ను ఏప్రిల్ 14, 2022న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. టీజ‌ర్‌లో చూపించిన‌ట్లు ఓ భారీ మెషిన్ గ‌న్ ప‌ట్టుకుని నిల‌బ‌డిన య‌ష్‌, హీరోయిన్ శ్రీనిధి శెట్టితో పాటు అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా న‌టించిన బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌, రిమికా సేన్ అనే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో మ‌రో బాలీవుడ్ స్టార్ ర‌వీనాటాండ‌న్‌, ప్రకాశ్ రాజ్‌, రావు ర‌మేశ్‌, స‌హా చిత్రంలోని ఇత‌ర తారాగ‌ణం వారి వారి డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తున్నారు. అయితే ప్ర‌ధానంగా పోస్ట‌ర్‌లో చంటిపిల్లాడిని ప‌ట్టుకుని బాధ‌తో గుండెల‌కు హ‌త్తుకున్న అమ్మను కూడా చూడొచ్చు. ఇది సినిమాలోని ఎమోష‌న‌ల్ యాంగిల్ అయిన మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను ఎలివేట్ చేస్తుంది.

అగ్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఏప్రిల్ 14 2022లో రాబోతున్న ఈ యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్