Sunday, January 19, 2025
Homeసినిమా'ఖుషీ' ప్లాన్ మారిందా..?

‘ఖుషీ’ ప్లాన్ మారిందా..?

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో పాన్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తానని.. ఇండియా మొత్తం షేక్ అవుతుందని విజయ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. అయితే.. ఆ నమ్మకం నిజం కాలేదు. ఇది విజయ్ కి గట్టి షాక్ అని చెప్పచ్చు. దీంతో ఆలోచనలో పడిన విజయ్ తదుపరి చిత్రాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే.. విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘ఖుషి’. ఈ సినిమాలో  సరసన సమంత నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి షెడ్యూల్ కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంది. ఆ తరువాత హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఆ తరువాత నుంచి సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. విజయ్ లైగర్ ప్రమోషన్స్ లో బిజీగా వుండటం సమంత యశోద షూటింగ్ లో బిజీగా వుండటంతో ఈ మూవీ షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.

సమంత ప్రత్యేక ట్రీట్ మెంట్ నిమిత్తం యుఎస్ వెళ్లడంతో షూటింగ్ కి మళ్లీ అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు సామ్ యుఎస్ నుంచి తిరిగి రావడం విజయ్ దేవరకొండ కూడా అందుబాటులో వుండటంతో ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ని నవంబర్ 15 నుంచి మొదలు పెట్టబోతున్నారట. కారణం సమంత నటిస్తున్న యశోద మూవీ నవంబర్ 11న పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది.  మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత సినిమా రిలీజ్ తరువాత నుంచి ఖుషీ షూటింగ్ కు అందుబాటులో వుండనుందట. అయితే.. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అనుకున్నవిధంగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడం.. విజయ్ ఇంకా లైగర్ మూడ్ లోనే ఉండడంతో ఖుషి మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. మరి.. ఖుషి సినిమాతో విజయ్ సక్సెస్ సాధించి ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్