Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం జగన్ తో కియా ఎండి భేటి

సిఎం జగన్ తో కియా ఎండి భేటి

Kia Company India Md Met Ap Cm Jagan

కియా కంపెనీ ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమకు పూర్తి సహాయ సహకారాలు అందించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు.

ఏపీ ప్రభుత్వ సహకారం వల్లే తాము అనుకున్న ఉత్పత్తి సామర్ధ్యానికి మించి కార్లను తయారుచేసి, మార్కెటింగ్‌ చేయగలిగినట్లు ముఖ్యమంత్రికి కియా ప్రతినిధులు వివరించారు.  ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై కియా ఇండియా టీంతో సీఎం జగన్ చర్చించారు.  సిఎం జగన్ టే–జిన్‌ పార్క్‌ ని సన్మానించి, జ్ఞాపిక అందజేశారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కియా ఇండియా చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కబ్‌ డాంగ్‌ లీ, లీగల్, కార్పొరేట్‌ ఎఫైర్స్‌ హెవోడీలు జూడ్‌ లీ, యాంగ్‌ గిల్‌ మా, ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ టి.సోమశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : రైతులకు నేడు పంట నష్టం పంపిణీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్