Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ సరసన కైరా అద్వాని

ఎన్టీఆర్ సరసన కైరా అద్వాని

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సంచలన చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ బ్లాక్ బస్ట్రర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఎన్టీఆర్ – కొరటాల కలసి జనతా గ్యారేజ్ మూవీ చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు కైరా అద్వానిని సెలెక్ట్ చేసారని తెలిసింది. కైరా టాలీవుడ్ లో కొరటాల తెరకెక్కించిన భరత్ అనే నేను సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో నటించేందుకు కొరటాల కాంటాక్ట్ చేయగా వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. భరత్ అనే నేను సినిమా తర్వాత కైరా తెలుగులో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది.

ఇప్పుడు ఎన్టీఆర్ సరసన నటించబోతుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తి చేయాలి. కొరటాల ఆచార్య మూవీ పూర్తి చేయాలి. అంటే.. సెప్టెంబర్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్