Monday, February 24, 2025
Homeసినిమాకిచ్చాసుదీప్‌ 'హెబ్బులి' ఆగస్ట్ 4న విడుదల

కిచ్చాసుదీప్‌ ‘హెబ్బులి’ ఆగస్ట్ 4న విడుదల

కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హెబ్బులి’. ఈ చిత్రానికి ఎస్.కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో సుదీప్ కి జంటగా అమలాపాల్ నటించింది. ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ పతాకంపై సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన . ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకోవడమే కాకుండా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 4న గ్రాండ్ గా విడుదల అవుతుంది.

సి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది.కన్నడలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి 100 కోట్లు  సాధించిన పక్కా కమర్షియల్ మూవీ.అందుకే తెలుగు లో విడుదల చేస్తున్నాను.కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 4న గ్రాండ్ గా తెలుగులో  ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న మా హెబ్బులి సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్