Saturday, June 13, 2026
Homeసినిమావిడుదలకు సిద్ధమైన కిచ్చాసుదీప్‌ 'హెబ్బులి'

విడుదలకు సిద్ధమైన కిచ్చాసుదీప్‌ ‘హెబ్బులి’

కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ హెబ్బులి. ఈ చిత్రానికి ఎస్.కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో సుదీప్ కి జంటగా అమలాపాల్ నటించింది. కన్నడలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్‌ మరియు సెన్సార్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వి.రవిచంద్రన్‌, పి. రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్ మరియు రవి కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు.

ఎ. కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సౌండ్‌ట్రాక్ మరియు ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు. హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ ఇది. డబ్బింగ్‌ మరియు సెన్సార్‌ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. మరి.. కన్నడలో వలే తెలుగులో కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular