Saturday, January 18, 2025
HomeసినిమాRules Ranjann Release: కిరణ్ అబ్బవరం, 'రూల్స్ రంజన్' అక్టోబర్ 6 న విడుదల

Rules Ranjann Release: కిరణ్ అబ్బవరం, ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6 న విడుదల

ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తునారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా విడుదల అయిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. ‘రూల్స్ రంజన్’ నుంచి విడుదల అవుతున్న ప్రతీ ప్రచార చిత్రం  సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన మెరుగైన ప్రతిభ ను కనబరుస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 6న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

ఈ మేరకు ఆకట్టుకునే నూతన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. చిత్ర కథ, దానికి అనుగుణంగా సాగే సన్నివేశాలు, వాటికి తగ్గట్లుగా సంభాషణలు, వీటన్నింటినీ స్థాయిని పెంచే రీతిలో నేపథ్య సంగీతం, సందర్భ శుద్ధి గా సాగే పాటలు ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అన్నారు నిర్మాతలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్