Sunday, January 19, 2025
HomeTrending Newsమీడియా సంస్థలను తొక్కుతా అన్నదెవరు - కిషన్ రెడ్డి

మీడియా సంస్థలను తొక్కుతా అన్నదెవరు – కిషన్ రెడ్డి

తమకు వ్యతిరేకంగా రాస్తున్నారంటూ వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం.. పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీబీసీ సంస్థపై ఐటీ దాడులపై బీఆర్ఎస్ నేతలు అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఢిల్లీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికాస్వేచ్ఛను కాలరాసిన కల్వకుంట్ల కుటుంబం చేసే పనుల గురించి, వారి వ్యవహార శైలి ఎలాంటిదో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎక్కడా మీడియా సంస్థలపై దాడులు చేయడం లేదని.. అది బీఆర్ఎస్ పార్టీకి అలవాటైన పని అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కుటుంబం పత్రికాస్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

Also Read : గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్