Saturday, January 18, 2025
Homeతెలంగాణవాక్సిన్ ఎందుకు నిలిపేశారు? : కిషన్ రెడ్డి

వాక్సిన్ ఎందుకు నిలిపేశారు? : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో 6 లక్షల డోసులు అందుబాటులో ఉన్నా వాక్సినేషన్ కార్యక్రమం ఎందుకు నిలిపి వేశారో చెప్పాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారం రోజులుగా వాక్సిన్ వేయడం లేదని, రెండో డోసు తీసుకోవాల్సినవారు ఎదురు చూపులు చూస్తున్నారని చెప్పారు. భారతీయ జనతా యువ మోర్చా అధ్వర్యంలో చేపట్టిన కోవిడ్ బాధితులకు ఆహార పంపిణి కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు.

త్వరలో రాష్ట్రానికి మరో లక్ష డోసుల వాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతుందని, వెంటనే రెండో డోసు ఇవ్వాల్సిన వారికి వాక్సిన్ మొదలు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో 46 ఆస్పత్రులకు పిఎం కేర్స్ నుంచి 1405 వెంటిలేటర్లు అందించామని కిషన్ రెడ్డి వెల్లడించారు, రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా వాక్సిన్ అందించాలని కోరారు. ఆస్పత్రుల్లో వెంటనే వైద్య సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్