Sunday, January 19, 2025
Homeతెలంగాణలాక్ డౌన్ పై నిర్ణయం రాష్ట్రాలదే : కిషన్ రెడ్డి

లాక్ డౌన్ పై నిర్ణయం రాష్ట్రాలదే : కిషన్ రెడ్డి

లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆక్సిజన్ సరఫరా కోసం యుద్ధ విమానాల సాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ దేశాల్లో కోవిడ్ రికవరీ రేటు మనదేశంలోనే ఎక్కువగా వుందన్నారు. బీబీనగర్ లోని నిమ్స్ ను కిషన్ రెడ్డి సందర్శించారు. కోవిడ్ వార్డును పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఎయిమ్స్ డైరెక్టర్ అనిల్ భాటియా, పాల్గొన్నారు. ఎయిమ్స్ లో ఆక్సిజన్ కొరతపై రాష్ట వైద్య శాఖ డైరెక్టర్ తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

గాలి ద్వారా ఆక్సిజన్ తయారీ విధానాన్ని త్వరలో ఎయిమ్స్ లో ప్రారంభిస్తామన్న కిషన్ రెడ్డి కరోనా చికిత్స ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్