Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్KL Rahul: వెస్టిండీస్ టూర్ కు మిస్

KL Rahul: వెస్టిండీస్ టూర్ కు మిస్

కెఎల్ రాహుల్ మరో సిరీస్ కు దూరమయ్యాడు. ఈ నెల 29నుంచి వెస్టిండీస్ తో ఆ దేశంలో జరిగే ఐదు మ్యాచ్ ల టి 20సిరీస్ కు మిస్ అయ్యాడు.  ఐపీఎల్ ముగిసిన తర్వాత స్వదేశంలో జరిగిన సౌతాఫ్రికా టూర్ కు రాహుల్ నే కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే స్పోర్ట్స్ హెర్నియా  సర్జరీ చేయించుకోవాల్సి రావడంతో సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. దీనితో పంత్ కు బాధ్యతలు అప్పగించారు.  ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు కూడా రాహుల్ మిస్ అయ్యారు. సర్జరీ పూర్తి కావడంతో వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో  రాహుల్ కు చోటు కల్పించారు. రోహిత్ నేతృత్వంలో టి 20 జట్టుగతవారం ట్రినిడాడ్ చేరుకుంది.

సర్జరీ తర్వాతా బెంగుళూరు లోని క్రికెట్ అకాడమీ లో  సాధన చేస్తున్న రాహుల్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఐసోలేషన్ కు పంపారు.  వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ  కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్నందున ఓ వారం విశ్రాంతి అవసరమని డాక్టర్లు రాహుల్ కు సూచించారు. ఈ కారణంగానే రాహుల్ ను విండీస్ పంపడం లేదని బిసిసిఐ వెల్లడించింది.

ఆగస్ట్ 27 నుంచి మొదలు కానున్న ఆసియా కప్ -2022లో రాహుల్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Also Read :  వెస్టిండీస్ తో సిరీస్ కు ధావన్ సారధ్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్