Saturday, March 29, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఎమ్మెల్యే అనే పిలవండి: కొడాలి సూచన

ఎమ్మెల్యే అనే పిలవండి: కొడాలి సూచన

Call me MLA:  మంత్రి పదవి తనకు పెద్ద లెక్కలోనిది కాదని, తనకు అన్నిటికంటే ఇష్టమైన పదవి ఎమ్మెల్యే అని రాష్ట్ర మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడ నియోజకవర్గంలో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న నాని, తనను అందరూ మాజీ మంత్రి అని సంబోధించడంపై స్పందించారు. తనను ఎవరైనా పిలిచేటప్పుడు గుడివాడ నియోజకవర్గంలో అయితే స్థానిక శాసన సభ్యుడు అని, బైట ప్రాంతాల్లో అయితే గుడివాడ శాసన సభ్యుడు అని పిలిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రి పదవి పోయినందుకు బాధలేదని, కానీ ఎమ్మెల్యే పదవి పొతే మాత్రం చాలా బాధపడతానని వెల్లడించారు. బలహీన వర్గాలను ఆర్ధికంగా, సామాజికంగా పైకి తీసుకురావడానికి కృషి చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోవడం వల్లే రాష్ట్రం రెండుముక్కలైందని, ఇప్పుడు జగన్ లేకపోతే రాష్ట్రం సర్వనాశనమవుతుందని కొడాలి జోస్యం చెప్పారు. తనకు జగన్ వెనుక ఉండి పనిచేయడమే ఇష్టమని చెప్పారు. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందంటూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కొడాలి ఫైర్ అయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్