Sunday, September 8, 2024
HomeTrending Newsఉద్యోగాల భర్తీ పై బహిరంగ చర్చకు సవాల్

ఉద్యోగాల భర్తీ పై బహిరంగ చర్చకు సవాల్

పెత్ర అమావాస్య సందర్భంగా ఈ రోజు గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర  తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన అమరవీరుల కు “తెలంగాణ జన సమితి పార్టీ  ఆధ్వర్యంలో”” బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు  ప్రో.కోదండరాం మాట్లాడుతూ నిండు అసెంబ్లీలో CM KCR అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. 1లక్ష 50 వేలు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో 80 వేలు భర్తీ చేస్తామని అబద్దాలు చెపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీలపై శ్వేతా పత్రం విడుదల చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో 2 లక్షల 80 వేలు ఖాళీగా ఉన్నాయని,  KCR ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా ఇవ్వడం లేదని కోదండరామ్ విమర్శించారు. అందుకే సునీల్ నాయక్,షబ్బీర్, నాగేశ్వరరావు, మురళి,రామకృష్ణ,కొండల్ లాంటి నిరుద్యోగులు ఎంతో మంది కేవలం ఉద్యోగాలు లేక చనిపోయారని,కనీసం వారి కుటుంబాలను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. kcr  ప్రభుత్వం వల్ల నే నిరుద్యోగులు చనిపోయారు,వెంటనే వారి కుటుంబాను ఆదుకోవాలని, అమరవీరులను స్మరించుకుని, వారి ఆశయాలను సాధించాలన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చట్టబద్ధత కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, యూనివర్సిటీ లలో ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. 2018 ఎన్నికల ముందు నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసం చేశారు, ఇప్పటి వరకు  ప్రభుత్వం భర్తీ చేసింది కేవలం 77 వేల ఉద్యోగాలు మాత్రమేనని, అవసరమైతే ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమని కోదండరామ్ సవాల్ చేశారు.  అమరవీరుల సాక్షిగా బహిరంగ చర్చకు సిద్దమన్నారు.

ఈ కార్యక్రమంలో TJS పార్టీ   ఉపాధ్యక్షులు PL విశ్వేశ్వర రావు , TJS పార్టీ రాష్ట్ర నాయకులు నిజ్జన రమేష్,  హైదరాబాద్ అధ్యక్షులు నర్సయ్య,  రాష్ట్ర నాయకులు శ్రీధర్  “విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు బాబుమహాజన్ , ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్ గారు , డప్పు గోపి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్