Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Gift: రాఫ్ కు జెర్సీ ఇచ్చిన కోహ్లీ

Gift: రాఫ్ కు జెర్సీ ఇచ్చిన కోహ్లీ

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ అరుదైన బహుమతిని పాకిస్తాన్ పేస్ బౌలర్ హారిస్ రాఫ్ కు అందించాడు. తన జెర్సీపై సంతకం పెట్టి దాన్ని రాఫ్ కు గిఫ్ట్ ఇచ్చాడు. నిన్న ఇండియా-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ లో భాగంగా జరిగిన టి 20 మ్యాచ్ లో ఇండియా ఐదు వికెట్ల తేడాతో  విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనతరం ఇరు జట్ల ఆటగాళ్ళు కలుసుకొని పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఇదే సందర్భంలో కోహ్లీ తాను ధరించే టీమిండియా అధికారిక జెర్సీ పై సంతకం పెట్టి ఇచ్చాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

గత ఏడాది అక్టోబర్ 24 న జరిగిన టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియాపై పాక్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్ లో ఇండియా లీగ్ దశలోనే ఇంటి బాట పట్టగా పాకిస్తాన్ సెమీస్ కు చేరుకొని అక్కడ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది, ఆ ఓటమికి టీమిండియా నిన్న బదులు  తీర్చుకుంది.

గత మ్యాచ్ సందర్భంగా కూడా ఇండియా-పాకిస్తాన్ కెప్టెన్లు కోహ్లీ- బాబర్ ఆజమ్ లు సుహృద్భావ వాతావరణంలో ముచ్చటించుకున్న విషయం గమనార్హం.

Also Read : Asia Cup-2022: దాయాదుల పోరులో ఇండియాదే విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్