Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్IPL 2024: విజేత కోల్ కతా

IPL 2024: విజేత కోల్ కతా

ఐపీఎల్ 2024 ఫైనల్ లో హైదరాబాద్ చేతులెత్తేసింది. కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలం కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.  హైదరాబాద్ ఇచ్చిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఛేదించి కోల్ కతా విజేతగా నిలిచింది.

చెన్నై లోనే ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ కమ్మిన్స్ చేసిన 24 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఏడెన్ మార్ క్రమ్ 20; క్లాసెన్ 16; నితీష్ కుమార్ రెడ్డి 13 మినహా మిగిలిన అందరూ సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు.

కోల్ కతా బౌలర్ మిచెల్ స్టార్క్ మరో సారి తొలి ఓవర్లోనే వికెట్ సాధించి సత్తా చాటాడు. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్లో మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3; స్టార్క్, హర్షిత్ రాణా చెరో 2; వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ సాధించారు.

లక్ష్య సాధనలో కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్ 6 పరుగులకే ఔటైనా మరో ఓపెనర్ గుర్జాబ్ వెంకటేష్ అయ్యర్ లు ధాటిగా ఆడి జట్టును అలవోకగా గెలిపించారు. గుర్జాబ్ 32 బంతుల్లో 5 ఫోర్లు,  2 సిక్సర్లతో 39 పరుగులకు ఔట్ కాగా, వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 రన్స్, శ్రేయాస్ అయ్యర్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్