Friday, September 20, 2024
Homeసినిమా'విశ్వంభర'లో కోలీవుడ్ స్టార్ హీరో!

‘విశ్వంభర’లో కోలీవుడ్ స్టార్ హీరో!

చిరంజీవి – శ్రీవశిష్ఠ కాంబినేషన్లో ‘విశ్వంభర’ సినిమా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ తోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోయాయి. అంతేకాకుండా ఇది ఫాంటసీతో కూడిన డ్రామా కావడం .. చిరంజీవి ఈ జోనర్లో సినిమా చేసి చాలా కాలం కావడం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారనే టాక్ మరింతగా ఆడియన్స్ లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

అలాంటి ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబూ నటించనున్నట్టు ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన ఒక కీలకమైన రోల్ ఉందట. దానిని శింబూ చేస్తే బాగుంటుందని భావించిన వశిష్ఠ, ఆయనను సంప్రదిస్తున్నట్టుగా ఒక రూమర్ అయితే హల్ చల్ చేస్తోంది. ఈ పాత్రను వశిష్ఠ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడనీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ పాత్ర కొనసాగుతుందని అంటున్నారు. మెగాస్టార్ కాంబినేషన్లోను కొన్ని సీన్స్ ఉంటాయని చెబుతున్నారు.

శింబూ తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే. అయితే సూర్య .. కార్తి .. ధనుశ్ మాదిరిగా అతను తెలుగు ఆడియన్స్ కి అంతగా చేరువ కాలేదు. ఈ మధ్య కాలంలో అతను నేరుగా చేసే తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దనున్నట్టు శ్రీవశిష్ఠ చెబుతున్నాడు. మెగాస్టార్ ఇమేజ్ కి తగిన సినిమా అనీ, ఆయనను ఆడియన్స్ ఎలా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారో అలాగే ఈ సినిమా ఉంటుందని అంటున్నాడు. ఇక శింబూ విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్