మునుగోడు ఉప ఎన్నికలకు రేవంత్ చేతులు ఎత్తేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. గెలుస్తాం అని చెప్పాలి కానీ…ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారని విమర్శించారు. మునుగోడు బహిరంగ సభకు తనకు ఆహ్వానం లేదని… మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కి వెళ్ళను అని తెగేసి చెప్పారు. రేవంత్ ips..మేమంతా హామీ గార్డుల మా..? అని ఎద్దేవా చేశారు. Ips కదా..మునుగోడు ను ఆయనే గెలిపించు కోమని కోమటిరెడ్డి అన్నారు. తానూ సోనియా, రాహుల్ వెంటే ఉంటానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
పిసిసి నేతలు మల్లు భట్టి విక్రమార్క..ఉత్తమ్ కుమార్ రెడ్డి ..శ్రీధర్ బాబులు నేను హోం గార్డుల మా..అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పార్టీ నుండి బయటకు పంపే కుట్ర జరుగుతోందని, జానారెడ్డి ఇంటికి వెళ్ళిన మణికం టాగూర్ తన ఇంటికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తనతో మాట్లాడలేదని, టాగూర్ వచ్చినట్టు కూడా సమాచారం లేదని స్పష్టం చేశారు. పిలవని పేరంటంకి వెళ్ళడం అలవాటు లేదని..నన్ను కావాలని తిట్టించారని కోమటిరెడ్డి ఆరోపించారు. నన్ను బ్రాందీ షాపులో పనిచేసే వారితో పోల్చుతాడా.. బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన మీద చండూరు సభలో మాట్లాడిన వ్యక్తి చిన్న పిల్లగాడని, ఆయనకు టికెట్ ఇప్పించి సపోర్ట్ చేసింది తామేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
Also Read : మునుగోడుపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రాంగం