Sunday, January 19, 2025
HomeసినిమాEndira Ee Panchayathi: కోనవెంకట్ చేతుల మీదుగా 'ఏందిరా ఈ పంచాయితీ' పాట విడుదల

Endira Ee Panchayathi: కోనవెంకట్ చేతుల మీదుగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ పాట విడుదల

అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రం ఒకటి రాబోతోంది.’ఏందిరా ఈ పంచాయితీ’ అనే ఈ మూవీ విలేజ్ లవ్ స్టోరీగా రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.

ఇది వరకే ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లింప్స్ సైతం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ చేతుల మీదుగా ఏమో ఏమో అంటూ సాగే పాటను విడుదల చేశారు. పీఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, సతీష్ మాసం విజువల్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలి, చూడాలనేట్టుగా చేశాయి. ఈ మెలోడీ పాట ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటకు పీఆర్ సాహిత్యాన్ని అందించారు.

పాటను రిలీజ్ చేసిన అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ పాట బాగుంది. కొత్త వాళ్లైనా చక్కగా నటించారు. హీరో హీరోయిన్ల జంట బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్